![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1000లో..... ఇందు ఒంటరిగా కూర్చొని ప్రొద్దున లేస్తే జరగబోయే దాని గురించి టెన్షన్ పడుతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కావ్య తన పక్కకి వచ్చి కూర్చొని ఇందుకి దైర్యం చెప్తుంది. ప్రతీ యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు.. ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టనని మోటివేట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇందు పడుకొని ఉంటే రేఖ వాళ్ళు చుట్టూ చేరి హ్యాపీ బర్త్ డే అని విష్ చేస్తారు. అందరికి థాంక్స్ చెప్తుంది ఇందు. ఇన్నిరోజులు లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నావో నాకు తెలుసని అపర్ణ అనగానే కోపంగా ఉంటే కోపం అంటారు.. ప్రేమ ఉంటే కూడా ఇలా అంటారేంటని రేఖ అంటుంది.
ఇందు నువ్వు నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు.. ఫామ్ హౌస్ కి రా అని రేఖ చెప్పి వెళ్తుంది. ఇందు నువ్వు మాత్రం ఈ ఆస్తులన్నీ తన పేరున పెట్టి దీన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళని అన్యాయం చెయ్యకని అపర్ణ చెప్పి వెళ్తుంది. ఏం చేయబోతున్నావ్ అక్క అని స్వాతి అడుగుతుంది. పార్టీ లో కేక్ కట్ చేసాక నాకు నేనుగా కిడ్నాప్ అవుతాను.. నువ్వే హెల్ప్ చెయ్యాలని ఇందు అనగానే ఇప్పుడు తప్పించుకున్న తర్వాత అయిన కూడా సంతకం చెయ్యాలి కదా అని స్వాతి అనగానే నాకు కొన్ని రోజులు టైమ్ కావాలని ఇందు అంటుంది. దాంతో సరే అని స్వాతి అంటుంది. ఆ తర్వాత రేఖ ఫామ్ హౌస్ కి వెళ్లి వచ్చిన గెస్ట్ లని రిసీవ్ చేసుకుంటుంది. అక్కడికి వచ్చిన వీళ్ళందరు రేఖకి అప్పు ఇచ్చిన వాళ్ళే పార్టీలో ఆస్తులన్నీ తన పేరున అయ్యాయని వాళ్ళకి నమ్మకం కలగడానికి అందరిని పిలుస్తుంది.
మరొకవైపు రాజు, లక్కీల కోసం ఐశ్వర్య వెయిట్ చేస్తుంది. వాళ్ళు వస్తారు. రాగానే మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడుతారు. ఇందుని కిడ్నాప్ చేసాక నా మీద డౌట్ వస్తుందని ఐశ్వర్య అనగానే ఇద్దరు వెయిటర్ గెటప్ లో వస్తారు. తరువాయి భాగంలో ఇందు అందంగా రెడీ అయి ఫామ్ హౌస్ కి వస్తుంది. తనని చూసి రాక్షసి అనుకున్నా కానీ అందాల రాక్షసి అని లక్కీతో రాజు అంటాడు. అనుకోకుండా అక్కడికి నందు వస్తుంది. అపర్ణని చూసి గుర్తుపట్టి నానమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |